Amara Rama Suma Rama Song Lyrics


అమరారామ సుమా రామ చరి కామధేను క్షీరాలతో... సాయినాథ నీ పావన మూర్తికి అభిషేకం క్షీరాభిషేకం...!
(అమరాతివతిన సంచరించు కామధేను క్షీరంతో (పాలతో ) అభిషేకం)
సురకల్పలతా సురభిడ సుమాల సురు చిర సుమధుర మకరందంతో... సాయినాథ నీ మంగళమూర్తి కి అభిషేకం మధురాభిషేకం...!
(దేవతా పుష్పముల నుండి సేకరించిన తేనెతో 
అభిషేకం)
మలయ మహీధర శిఖర వనాంతర చందన సుఖ శీతల గంధంతో... సాయినాథ నీ సుందర మూర్తికి అభిషేకం చందనాభిషేకం...!
(హిమాలయ శిఖర వనముల 
నుండి సేకరించిన గంధంతో అభిషేకం) 
శ్రీహరి పద  రాజీవ సముద్భవ గగన గంగ పావన శీకరముల... సాయినాథ నీ శ్రీకర మూర్తికి అభిషేకం నీరాభిషేకం...!
(శ్రీహరి పాదాల పుట్టిన గంగా జలంతో 
అభిషేకం)
నీ పవహీజసమీపధునీగత ఆదివ్యాధి నిరోధి ఊదితో…నీ పవహీజసమీపధునీగత ఆదివ్యాధి నిరోధి ఊదితో...సాయినాథ నీ తేజోమూర్తికి
అభిషేకం ఊద్యాభిషేకం...!
(నీ ధుని నుండి సమీకరించిన, వ్యాధి నిరోధి ఊదితో 
అభిషేకం)
జయహో సాయి  జయం జయం నీ  పదకమలములకు జయం  జయం...
జయహో సాయి  జయం జయం నీ  పదకమలములకు జయం  జయం...
జయహో సాయి  జయం జయం నీ  పదకమలములకు జయం  జయం...!